ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం
తిధి: వైశాఖ బహుళ త్రయోదశి..
భగవంతుడు మానవుడిగ మారడానికి ఏన్నో ఆవతారలను ఎత్తల్సివచ్చింది. మొదటగా మత్స్యవతారం, తరువాత కూర్మవతారం ఆ తరువాత నరసింహావతారం.ఈ నరసింహవతారం సగం నరుడు మిగిలిన సగం సింహాం రూపం.
ఆవతార రహస్యం: హిరణ్యకసిపుడు(రాక్షసుడు) బ్రహ్మకై తప్పసు చేసి , తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకున్నాడు.
ఆ వరాన్ని అనుసరించి, నరసి హవతారం జరిగింది.
హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగం కాదు, రేండు కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.
నరసింహస్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చెది ప్రహ్లదుడు..
భక్త ప్రహ్లద:
బాల భక్తుడు అంటే ఎవరికైన మొదటగా గుర్తుకువచ్చేది ప్రహ్లదుడే. ఒక రాక్షసుడు (హిరణ్యకసిపుడు) కూమరుడైనప్పటికి, శ్రీహరిపై తన భక్తిని, విశ్వాసాన్ని వదలక ఏన్నో కష్టలకోర్చి, శ్రీహరిని మరోసారి భక్తసులభుడని నిరూపించాడు.
నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……
ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!
No comments:
Post a Comment