May 26, 2013

విశ్వనాధష్టకం




గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయనః ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||
ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
.

వరాహ లక్ష్మీ నృసింహ స్వామి




ఈ నెల 13-05-2013 వ తేదీన సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు.... స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము.

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.

చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.

శివుని కన్న అల్ప సంతోషి వేరేవరు?



అల్ప సంతోషి అంటే ఎవరికైన ముందు గుర్తుకువచ్చేది మహాదేవుడే... 

చిటికేడు విభూతి, దోసేడు నీళ్ళు తనపై వేస్తెనే చాలు, సంతోషంతో మన పపాలను హారింపచేస్తాడు పరమేశ్వరుడు...

అయ్యవారి పూజకు ఏవిధమైన వస్తువులు ఖరీదు చేయవలసిన అవసరమే లేదు...

నాలుగు బిల్వ పత్రలు తేచ్చి పూజిస్తే కరుణతో దిగివచి వరలను అందించే భోలాశంకరుడు...

స్నానం, ఆచారం, సంప్రదాయం వంటివి ఏమి లేకున్న చిత్తశుద్ధితో, భక్తితో శివ అని నామస్మరణ చేస్తే చాలు ముక్తినోసగే కైలసనాధుడు...

శివ నామస్మరణ చేసినంతనే చింతలు తీరుతుంటే, శివ భక్తులు కూడ అల్ప సంతోషులుగా మరితిరల్సిందే కదా...

అసలు అల్ప సంతోషం అంటే ఎమిటి???

నాకు వంద రూపాయలు కావాలి.. కాని నేను రేండు వందల రూపాయల కోరుకుంటే అది అత్యస...

నాకు వంద రూపాయలు కావాలి, ఇప్పుడు నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి.. మిగిలినవి కూడ దోరుకుతాయి నా అవసరం గడిచిపోతుందిలే అనుకొని ఏ చింత లేకుండా అనందంగా జీవించాగలిగేవాడే అల్ప సంతోషి ....

లక్ష్మి నరసింహస్వామి జయంతి..


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం




తిధి: వైశాఖ బహుళ త్రయోదశి..

భగవంతుడు మానవుడిగ మారడానికి ఏన్నో ఆవతారలను ఎత్తల్సివచ్చింది. మొదటగా మత్స్యవతారం, తరువాత కూర్మవతారం ఆ తరువాత నరసింహావతారం.ఈ నరసింహవతారం సగం నరుడు మిగిలిన సగం సింహాం రూపం. 

ఆవతార రహస్యం: హిరణ్యకసిపుడు(రాక్షసుడు) బ్రహ్మకై తప్పసు చేసి , తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకున్నాడు.

ఆ వరాన్ని అనుసరించి, నరసి హవతారం జరిగింది.
హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగం కాదు, రేండు కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.

నరసింహస్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చెది ప్రహ్లదుడు..

భక్త ప్రహ్లద:
బాల భక్తుడు అంటే ఎవరికైన మొదటగా గుర్తుకువచ్చేది ప్రహ్లదుడే. ఒక రాక్షసుడు (హిరణ్యకసిపుడు) కూమరుడైనప్పటికి, శ్రీహరిపై తన భక్తిని, విశ్వాసాన్ని వదలక ఏన్నో కష్టలకోర్చి, శ్రీహరిని మరోసారి భక్తసులభుడని నిరూపించాడు.


నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……

ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

May 5, 2013

బిల్వష్టకం

బిల్వష్టకం




త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః

తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః

కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః

నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా

తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం

కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ

భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః

యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)


దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం

అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే

అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)


అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా

అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)


బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.

May 4, 2013

చైత్ర బహుళ పంచమి-- మత్స్యావతార జయంతి



          ఒకనోక్క కాలంలో బ్రహ్మా నిద్రిస్తుండగా, సోమకసురుడనే రాక్షసుడు వేదలను ఆపహరించి వాటిని నాశనం చేయలనుకున్నాడు. ఏందుకంటే సృష్టి ధర్మలకు మూలం ఆ వేదలే. అలాంటి వేదలను నాశనం చేస్తే సృష్టిలో ఆరాచకం ప్రభలుతుందని వారి నమ్మకం. ఆ నాడు 
శ్రీ మహావిష్ణువు మత్స్యావతరంలో వచ్చి ఆ రాక్షసుని అంతమోందించి వేదలను రక్షించాడు. 

మరి ఈ నాడు, మనమే మన వేదలను, అందులోని ధర్మలను తెలిసి తేలియని ఆజ్ఙానంతో నాశనం చేస్తుంటే కాపాడే ఆ మహానీయుడు ఏప్పుడు వస్తాడో అని ఎదురుచూడటం, త్వరగా రావాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం…..


శివ ఋగ్వేద మంత్రం


కర్పూర గౌరం కరుణావతరం !
సంసార సారం భుజగేంద్ర హరం !!
సదా వసంతం హృదయరవిందే !
భవం భవాని సహితం నమామి !!


కర్పూర గౌరం  : కర్పూరం అంత స్వచ్ఛమైనవాడ..
కరుణావతరం   : కరుణాతో కూడిన వాడ / ధయస్వరూప..
సంసార సారం  : ఈ విశ్వం యొక్క భావము / తత్వము నీవు
భుజగేంద్ర హరం : ఫణి రాజుని కంఠభరణంగా ధరించినవాడ
సదా వసంతం  : ఏల్లప్పుడు చల్లగా కపాడువాడ.. 
హృదయరవిందే : పధ్మములాంటి హృదయము గలవాడ..  
భవం భవాని  : ఓ పార్వతి, పరమేశ్వరులార...
సహితం నమామి: మీకు శిరస్సువంచి పాదభివందనం చేస్తున్నాం..