Dec 19, 2013

ఏ తీరుగ నను దయ చుసేదవో ( EE thiruga nannu daya chusedavo lyrics)


తీరుగ నను దయ చుసేదవో ఇలవంశోత్తమ రామ

తీరుగ నను దయ చుసేదవో ఇలవంశోత్తమ రామ

నాతరమా భవ సాగరమీదను నళినదలెక్షణ రామ

నాతరమా భవ సాగరమీదను నళినదలెక్షణ రామ

శ్రీ రఘు నందన సీతరమణ శ్రీత జనపోషక రామ

కరుణ్యలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామ

కృరకర్మములు నెరక చెసితి నేరము లెంచకు రామ

కృరకర్మములు నెరక చెసితి నేరము లెంచకు రామ

దారిధ్ర్యము పరిహారము సేయవే ధైవ శిఖామని రామ

Nov 28, 2013

**శివ నామములు**



ఈ  శివ అష్టనామములు రోజు శివుని నమస్కరించేటప్పుడు స్మరించండి. 
అవి శివ అష్టోతరం చదవడం తో సమానం.


1. ఓం భవాయ నమః
2. ఓం శ్రీ శర్వాయ నమః
3. ఓం రుద్రాయ నమః
4. ఓం పశుపతయే నమః
5. ఓం ఉగ్రాయ నమః
6. ఓం శ్రీ మహతే నమః
7. ఓం భీమయ నమః
8. ఓం శ్రీ ఈశాయ నమః

Jul 11, 2013

మహప్రాణదీపం -- (manjunatha lyrics)


మంజునాధ  -- మహప్రాణదీపం
 
 
ఓం మహప్రాణదీపం శివమ్ శివమ్
మహోంకార రూపం శివమ్ శివమ్
మహసూర్య చంద్రాదినేత్రం పవిత్రం
మహగాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రం
మహకాంతి భీజమ్ మహదివ్య తేజమ్
భవానీసమేతం భజే మంజునాథం
ఓ..ఓం..ఓ..ఓంనమశంకరయాచ మయస్కరాయచ నమశ్షివయాచ -
శివతరాయచ భవహరాయచ

మహప్రాణ దీపం శివమ్ శివమ్

భజె మంజునాథమ్ శివమ్ శివమ్
అద్వైత భాస్కరమ్ అర్ధనారిశ్వరమ్

హ్రుదుశ హ్రుధయంగమమ్ చతురిధవిహంగమమ్
పంచ భూతాత్మకమ్ శత్చత్రునాశకమ్

సప్తస్వరేశ్వరమ్ అష్టసిద్ధీశ్వరమ్ నవరస మనోహరమ్
దశ దిశాసువిమలమ్

ఎకాదశోజ్వలమ్ ఎకనాథేశ్వరమ్

ప్రస్థుశివశంకరమ్ ప్రనథ జనకింకరమ్
దుర్జన భయంకరమ్ సజ్జన శుభంకరమ్
హారిభవ తారకమ్ ప్రకృతి విభ తారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశమ్ సురేశమ్ రుశేశమ్ పరేశమ్

నటేశమ్ గౌరీశమ్ గణేశమ్ భూథేశమ్
మహ మధుర పంచాక్షరిమంత్ర మాధ్యమ్
మహ హర్శ వర్శ ప్రవర్శమ్ సుధీశమ్
ఓం నమో హరయాచ స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ
మహ ప్రాణదీపమ్ శివమ్ శివమ్ ………
భజే మంజునాథమ్ శివమ్ ఓంశివమ్

డమ్ డమ్ డ డమ్డమ్.. డమ్ డమ్ డ డమ్డమ్

డంకా నినాధ నవ తండవాడంబరమ్
తద్దిమ్మి తకధిమ్మి ధిధిమ్మి ధిమిధిమ్మి
సంగీత సాహిత్య సుమ సమరమంబరమ్
ఓంకార హ్రీంకార శ్రీంకార హ్రైంకార మంత్ర బీజాక్షరమ్ మంజునాథేశ్వరమ్
ఋగ్వేద మాధ్యమ్ యజుర్వేద వేద్యమ్ కామ ప్రగీథమ్ అధర్మ ప్రగాథమ్
పురానేతిహసమ్ ప్రసిద్ధమ్ విశుద్ధమ్ ప్రపంఛైక ధూతమ్ విభుద్ధమ్ సుహిద్ధమ్
న కారమ్ మ కారమ్ శి కారమ్ వ కారమ్ య కారమ్ నిరాకార సాకార సారం
మహ కాల కాలమ్ మహ నీలకంఠమ్ మహనంద నందమ్ మహట్టాట్టహాసమ్
జటాజూట రంగైక గంగా సుచిత్రమ్
జ్వల:రుధ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్
మహకాశ భాశమ్ మహ భాను లింగం….. మహ హన్తు వర్నమ్ సువర్నమ్ ప్రవర్నమ్
సౌరాష్ట్ర సుందరమ్ సొమనాథేశ్వరమ్ శ్రీశైల మందిరమ్ శ్రీమల్లికార్జునమ్
ఉజ్జయినిపుర మహ కాళేశ్వరమ్ వైధ్యనాథేశ్వరమ్ మహ భీమేశ్వరమ్ అమర లింగేశ్వరమ్
భావ లింగేశ్వరమ్ కాశి విశ్వేశ్వరమ్ పరమ్ గ్రిశ్నెశ్వరమ్
త్ర్యంబకాధీశ్వరమ్ నాగలింగేశ్వరమ్ శ్రీ…… కేధరలింగేశ్వరమ్
అగ్నిలింగాత్మకమ్ జ్యోతిర్లింగాత్మకమ్ వాయులింగాత్మకమ్
ఆత్మలింగాత్మకమ్ అఖిలలింగాత్మకమ్ అగ్నిహోమాత్మకమ్..
అనాధిమ్ అమేయమ్ అజేయమ్ అచిన్త్యమ్ అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్
అనాధిమ్ అమేయమ్ అజేయమ్ అచిన్త్యమ్ అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్..
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్…..
ఓం…… నమ సోమయాచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలయచ కాంతయచ
రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయ..చ..

 

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా (devullu song lyrics)

దేవుళ్ళు  -- మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత     "మహా"
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్ఠాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి     "మహా"
ఓంకార రావాల  అరుణ కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను క్రుతయుగములోన
కొండపైన అర్జునుడు.. తపమును గావించెను,
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జుని పేరిట,
విజయవాడ అయినది నగరము
జగములన్నియు జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్దపసుపు  కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల   అరుణమణియే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన   కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ   ఇదియే ముక్తి దీపం      "మహా"
దేవి నవరాత్రులలో 
వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన  
 కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే  బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే  సుమంతమూర్తి గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని  జనులకందించే
దివ్యరూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గానమొసగు  వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు  ప్రసాదించు మహాదుర్గ
శత్రు నివాసిని సత్యస్వరూపిణి  మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి  శ్రీ రాజరాజేశ్వరీ
భక్తులందరికీ కన్నుల పండగ అమ్మా
నీ దర్శనం దుర్గామ్మా నీ దర్శనం  "మహా"

Jun 11, 2013

మహాదేవ శంభో lyrics

మహాదేవ శంభో... మహాదేవ శంభో ఓఓ..
మహేశ గిరిష ప్రభోదేవా దేవా..
మోరలించి పాలించా రావా...
మహాదేవ శంభో... ఓఓఓ
మహాదేవ శంభో..


జట్టాజూట్టదారి శివ చంద్రమౌలి నిటాలక్షనీవే సదా నాకు రక్ష.. "2"
ప్రతీకర శక్తి ప్రసాదించరావ..
ప్రసన్నము కావా  ప్రసన్నము కావా ..
మహాదేవ శంభో... మహాదేవ శంభో ఓఓఓ.
మహేశ గిరిష ప్రభోదేవా దేవా..
మోరలించి పాలించా రావా...  
మహాదేవ శంభో

శివోహాం శివోహాం శివోహాం శివోహాం

Jun 1, 2013

కాళిక ఆవతార రహాస్యం

     

 


పూర్వం రక్తబీజ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక్క వరం ఉంది. తన రక్తం నేలమీద పడిన వేంటనే ఇంకో రాక్షసుడు తన రూపంలోనే పుడతాడు. కాని రక్తం నేలమీద పడకుండా రాక్షసుని చంపడం కుదరని పని. అందుకే దుర్గ మాత కాళికదేవి రూపం ధరించింది. ఆ రూపంలో కాళికదేవి రక్తబీజున్ని సంహరిస్తు అతడి రక్తన్ని తాను సేవించేది. అలా ఆ రాక్షసుని సంహరించింది. కాని కాళికమాత రక్త దాహం ఇంకా తిరకపోవడంతో తనకు నమస్కారించ వచ్చిన దేవతలను కాడా సంహరించబోయింది. అలా తాను రక్తం కోసం వేదుకుతున్న సమయంలో తనకు ఏవరు ఎదురుపడిన, ఎదుట ఉన్న వారు ఎవరో ఎంటో అనే ఆలోచన లేకుండా సంహరిస్తుందని... తనకు ఆలోచన జ్ఞానం వచ్చేల చేయడానికి, పరమేశ్వరుడు కాళిక మాత నడిచి వచ్చే దారిలో నేలపై పడి ఉంటాడు. మాత కోపంతో భయంకరమైన అరుపులతో నృత్యం చేస్తు వచ్చి శివుని పై తన పాదం మోపుతుంది. తన పాదంకింద ఎవరున్నారు అని చూసేంతలోనే తనకి ఆలోచన జ్ఞానం వచ్చి తాను కాళిక ఆవతారన్ని విడిచి మరల ఆదిశక్తి రూపన్ని ధరిస్తుంది. 

కాళిక ఆవతారం:

కాళిక అంటే నల్లనిది అని అర్దం. చీకటి లో చేసే తంత్ర విధ్యలకు ఆమే అధినేత. మనం ఏ దేవత పేరు చేప్పి కోళ్ళాను, మేకల్ని బలి ఇచ్చిన వాటిని స్వీకరించేది కాళిక దేవి మాత్రమే. అమే మంచి చేడు అని ఏం చూడదు. తనను శరణు జోచ్చిన వారిని, తనకు ప్రితికరంగా నైవెద్యం సమర్పించిన వారికి, తాన పూజను భక్తి శ్రద్దలతో చేసిన వారికి ఏం కావాలన్న ఇస్తుంది. అందుకే మంత్రం, తంత్రం తేలిసిన, నేర్చుకోవాలన్న అందరు తాననే ఆశ్రయిస్తారు.. 
పూర్వం రాజులు తమ శత్రువులను జయించాటనికి కాళిక పూజనే చేసేవారు. మాత ఆశిస్సు పోందటానికి తమ శిరస్సున్ని తామే ఖండించుకునేవారు కూడా. దీనికి చక్కటి ఉదాహరణ బట్టీ విక్రమాదిత్యుని కధే...

May 26, 2013

విశ్వనాధష్టకం




గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయనః ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||
ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
.

వరాహ లక్ష్మీ నృసింహ స్వామి




ఈ నెల 13-05-2013 వ తేదీన సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు.... స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము.

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.

చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.

శివుని కన్న అల్ప సంతోషి వేరేవరు?



అల్ప సంతోషి అంటే ఎవరికైన ముందు గుర్తుకువచ్చేది మహాదేవుడే... 

చిటికేడు విభూతి, దోసేడు నీళ్ళు తనపై వేస్తెనే చాలు, సంతోషంతో మన పపాలను హారింపచేస్తాడు పరమేశ్వరుడు...

అయ్యవారి పూజకు ఏవిధమైన వస్తువులు ఖరీదు చేయవలసిన అవసరమే లేదు...

నాలుగు బిల్వ పత్రలు తేచ్చి పూజిస్తే కరుణతో దిగివచి వరలను అందించే భోలాశంకరుడు...

స్నానం, ఆచారం, సంప్రదాయం వంటివి ఏమి లేకున్న చిత్తశుద్ధితో, భక్తితో శివ అని నామస్మరణ చేస్తే చాలు ముక్తినోసగే కైలసనాధుడు...

శివ నామస్మరణ చేసినంతనే చింతలు తీరుతుంటే, శివ భక్తులు కూడ అల్ప సంతోషులుగా మరితిరల్సిందే కదా...

అసలు అల్ప సంతోషం అంటే ఎమిటి???

నాకు వంద రూపాయలు కావాలి.. కాని నేను రేండు వందల రూపాయల కోరుకుంటే అది అత్యస...

నాకు వంద రూపాయలు కావాలి, ఇప్పుడు నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి.. మిగిలినవి కూడ దోరుకుతాయి నా అవసరం గడిచిపోతుందిలే అనుకొని ఏ చింత లేకుండా అనందంగా జీవించాగలిగేవాడే అల్ప సంతోషి ....

లక్ష్మి నరసింహస్వామి జయంతి..


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం




తిధి: వైశాఖ బహుళ త్రయోదశి..

భగవంతుడు మానవుడిగ మారడానికి ఏన్నో ఆవతారలను ఎత్తల్సివచ్చింది. మొదటగా మత్స్యవతారం, తరువాత కూర్మవతారం ఆ తరువాత నరసింహావతారం.ఈ నరసింహవతారం సగం నరుడు మిగిలిన సగం సింహాం రూపం. 

ఆవతార రహస్యం: హిరణ్యకసిపుడు(రాక్షసుడు) బ్రహ్మకై తప్పసు చేసి , తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకున్నాడు.

ఆ వరాన్ని అనుసరించి, నరసి హవతారం జరిగింది.
హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగం కాదు, రేండు కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.

నరసింహస్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చెది ప్రహ్లదుడు..

భక్త ప్రహ్లద:
బాల భక్తుడు అంటే ఎవరికైన మొదటగా గుర్తుకువచ్చేది ప్రహ్లదుడే. ఒక రాక్షసుడు (హిరణ్యకసిపుడు) కూమరుడైనప్పటికి, శ్రీహరిపై తన భక్తిని, విశ్వాసాన్ని వదలక ఏన్నో కష్టలకోర్చి, శ్రీహరిని మరోసారి భక్తసులభుడని నిరూపించాడు.


నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……

ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

May 5, 2013

బిల్వష్టకం

బిల్వష్టకం




త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః

తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః

కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః

నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా

తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం

కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ

భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః

యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)


దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం

అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే

అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)


అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా

అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)


బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.