Apr 26, 2013
పెళ్ళికి వచ్చే దేవతలు
పెళ్ళికి వచ్చే దేవతలు
పెళ్ళిలో ప్రధమంగా గణపతి పూజ ప్రారంభమౌతుంది కాబట్టి వినాయకుడు ఆ పెళ్ళి మంటపానికి మొదటగా వస్తాడు. ఆయన తన పూజనందుకొని నిత్యవరుడై నిత్యకళ్యణాన్ని పచ్చతోరణంతో జరుపుకొనే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మిదేవితో సహా వేదికవద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీసమేతంగా మన పెళ్ళి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ వుంటాడు. శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా వస్తూన్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి ముందే పెళ్ళివేదిక వద్దకు అష్టదిక్పాలకులూ - అంటే ఎనిమిది దిక్కుల్నీ పరిపాలించే ఇంద్రుడు (తూర్పు), అగ్ని (ఆగ్నేయం), యముడు (దక్షిణం), నిరృతి (నైఋతి), వరుణుడు (పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) వీరందరూ వివాహవేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానేవస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ-అత్రి - భరద్వాజ- విశ్వామిత్ర- గౌతమ-కశ్యప-జమదగ్ని మొదలగు సప్తమహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్తోక్తమైన మంత్ర పూరక వివాహనికి నిస్వార్ధంగా ఇందరు దేవతలూ, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహన్ని మంత్ర పూర్వకంగా వద్దంటే మనము ఎంతో కోల్పోయినట్లే కదా!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment