Mar 5, 2013

**మహా శివరాత్రి విశిష్టత** ( Story behind Mahasivaratri)



మహా శివరాత్రి తిధి : మాఘమాస  కృష్ణ  పక్షం లోని చతుర్దశి రోజు..
1. పరమేశ్వరుడు లింగావాతరంలో ఉద్భవించిన రోజు..
2. ఆదిదేవుడు నీలాకంఠునిగా మారిన రోజు...
3. మహాదేవుడు చంద్రశేఖరుడైన రోజు..
4. మౄత్యుంజేయ మంత్రం అవిష్కరణ జరిగిన రోజు..
 5. పరమేశ్వరునితో పార్వతి కి కళ్యాణం జరిగిన రోజు... 



మహా శివరాత్రి విశిష్టత:  


మహాశివుని తో పార్వతి కళ్యాణం...

పార్వతి, పరమేశ్వరుల వివాహం జరిగిన రోజు కూడ మహశివరాత్రి రోజే...

  దక్షయజ్ఞనికి వచ్చి అక్కడ అవమానంతో సతీదేవి దేహత్యాగం చేసుకుంటూంది.. తరువాత శివుడు విరహ భాధతో విరక్తి చేందినవాడై కైలాసగిరిలో తప్పస్సు లో లీనమైపోతాడు.. సతీ అంశ, పార్వతి రూపంలో పర్వతరాజు హిమవంతునికి కుమార్తేగ జన్మిస్తుంది.. ఆమే బాల్యం నుంచే శివుని భక్తురాలు. శివుని భర్తగా భావించి పూజిస్తుంది. శివుని ప్రేమతో గేలుచుకోలేమని, భక్తితో మాత్రమే పోందగలమని, తప్పస్సు చేయడానికి సిద్దపడుతుంది. పార్వతి తప్పస్సు ఎలా చేస్తుందంటే... తప్పస్సే స్త్రీ రూపంలో మారిందా.. అన్నట్టుగా కఠోర తప్పస్సు చేసి, చివరికి తన భక్తితో శివుని పోందగలుగుతుంది. ఆదిశక్తి అంశ అయినసరే పార్వతి తన పుత్రిక ధర్మని అనుసరించి తల్లిదoడ్రుల సమ్మతితో శివుని వివాహమాడుతుంది... 




మహాశివుడు, లింగావతరంలో ఉధ్భవించిన కధ....



       బ్రహ్మ, విష్ణువులు ఇద్దరిలో ఎవరు గోప్పవారు అని సందేహం కలిగింది. అప్పుడు ఒకరితో ఒకరు యుద్దనికి దిగి, వివిధ రకాల అస్త్రలతో పోట్లడుకుంటారు, చివరిగా బ్రహ్మ పాశుపతాస్త్రం ని, విష్ణువు మహేశ్వరాస్త్రం ని ప్రయోగిస్తారు.ఆ రేండు అస్త్రలు చేసే విధ్వంసాన్ని ఆపడం ఎవరివల్ల కాదు. అప్పుడు మహాశివుడు అగ్నిస్తంభ రూపంలో వారిరువురి మధ్య నిలుస్తాడు.. ఆ రేండు అస్త్రాలను తనలో ఐక్యం చేసేసుకుంటాడు. అప్పుడే మొదటిసారిగ శివుడు, లింగ రూపంలో ఆవిర్భావిస్తాడు.. అది అర్ధరాత్రి.. చీకటి నిండిన సృష్టిలో అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు వెలుగు నింపిన రాత్రి. ఆ రాత్రే  మహాశివరాత్రి....

పరమేశ్వరుడు నీలకంఠునిగా మరిన కధ....







              దేవతలు, దానవులు అమృతం కోసం పాలకడలిని చిలికినపుడు ఏన్నో విలువైన వస్తువులు, అప్సరసలు ఇంకా లక్ష్మిదేవి ఇలా ఏన్నో పాలకడలి నుండి ఉధ్బవించాయి.. అలాగే వాటితోపాటు కాళకుట విషం కూడ ఉధ్బవించింది.. విషనికి విశ్వానే  నాశనం చేయ్యగలిగే శక్తి ఉంది.. విషం అంతకంతకి పేరుగుతు ఉంది. దానిని ఏవరైన తిసుకొని సేవించి సృష్టిని  కాపాడలని దేవులందరు వేడుకుంటున్నరు.. సమయంలో ఆదిదేవుడుదేవుదైన మహాదేవుడు విషన్ని సేవించి దానిని తన కంఠంలోనే ఆపేశడు.. విష ప్రభావం వలన శివుని కంఠం నీలంగా మరిపోయింది.. నాటి నుండి మహాదేవుడు నీలకంఠునిగా అవతరించారు. రోజు మఘ మాస, కృష్ణ పక్షం లోని చతుర్దశి రోజే మహాశివరాత్రి..  




శంకరుడు, చంద్రశేఖరునిగా మరిన కధ...
   



దక్ష ప్రజాపతికి ప్రసుతి ద్వార 24 మంది, పంచజని ద్వార 62 మంది కుమార్తేలు గలరు. అందులో 27 మంది కుమార్తేలకు చంద్రునితో కళ్యాణం జరిగింది. వారు మనం నక్షత్రలుగా పిలుచుకుంటూన్న కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పూనర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్తా, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పుర్వషాడ, ఉత్తరషాడ, శ్రవణ, ధనిష్ట, శతభిష,,పూర్వభాధ్ర, ఉత్తరభాధ్ర, రేవతి, అశ్వని, భరణి..

 27 మందిని పెళ్ళి చేసుకున్న చంద్రుడు,రోహినితో మత్రమే ప్రేమగా ఉండటంతో మిగిలిన 26 మంది భాదపడుతు ఉండేవారు. వీరి విచారనికి కారణం తేలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుని క్షిణించిపోమ్మని శపిస్తాడు.. చంద్రుడు, బ్రతికించమని దేవులందరిని వేడుకొనగా దీనికి శివుడే తగినవాడనడంతో భోలశంకరుని క్షమించమని ప్రార్ధిస్తాడు.. శివుడు చంద్రుని క్షమించి చంద్రుని తన శిరసున ధరిస్తాడు. శివుని వద్ద ఉండటంతో చంద్రునికి ప్రాణహని లేకపోయినప్పటికిని.. దక్షుని శపం వలన క్షిణించే గుణం తప్పదని, చంద్రుడు పక్షం రోజులు ప్రకాశించడం (కృష్ణ పక్షం) తరువత పక్షం రోజులు క్షిణించడం (శుక్ల పక్షం) ఇలా సృష్టి ఉన్నంత వరకు జరుగుతుందని శివుడు తేలియజేస్తాడు.

                 చంద్రుని శిరసున ధరించి పరమేశ్వరుడు చంద్రశేఖరుడైనడు. రోజే సోమనాధ్ క్షేత్రం వేలసింది.  అది మఘ మాస, కృష్ణపక్షం లోని చతుర్ధశి.. మనం జరుపుకుంటున్న మహాశివరాత్రి..  

  మౄత్యుంజయ మంత్రం ఆవిర్భవించిన రోజు కూడ మహశివరాత్రి రోజే !!!
 

No comments:

Post a Comment