Mar 30, 2013

*** పంచాక్షరి మంత్రం ***






నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై కారాయ నమఃశివాయ
మందాకినీ సలిల చందనచర్చితాయ, నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ, తస్మై కారాయ నమఃశివాయ
శివాయ గౌరీ వదనారవింద, సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై శి కారాయ నమఃశివాయ
వశిష్ట కుంభోద్భవ గౌతమాయ, మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ, తస్మై కారాయ నమఃశివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై కారాయ నమఃశివయ
        పంచాక్షరిం మీదం పుణ్యం య పఠే శివ సన్నిధౌ
        శివ లోక మహోభ్నోతి శివేన సహ మోధతే !!!

Mar 25, 2013

*** రుద్రాక్ష మహాత్మ్యము ***







           మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎ౦తయో ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశి౦చినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. పూర్వము వేలాది దివ్య స౦.లు స౦యమముతో తపస్సు చేయుచూ కొ౦త సమయము తరువాత నేత్రములు తెరిచెను. సు౦దరమగు ఆ నేత్ర పుటములను౦డి నీటి బి౦దువులు జారినవి. ఆ కన్నీటి బి౦దువులే రుద్రాక్ష అను పేరుగల వృక్షములైనవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వ వర్ణముల వారికి ఇచ్చెను. శివునకు ప్రీతికరమగు ఈ రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమున౦దు పుట్టినవి. శివుడు వాటిని మధుర, అయోధ్య, ల౦క, మలయ, సహ్య పర్వతములు, కాశీ మాత్రమే గాక, ఇ౦కనూ పది స్థానములలో లభ్యమగునట్లు చేసెను. వేద సమ్మతములగు రుద్రాక్షలు శ్రేష్ఠమైనవి, సహి౦పశక్యము కాని పాప సమూహములను నశి౦పచేయును. పరమ శివుని ఆజ్ఞచే ఈ శుభకరములగు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాల్గు భేదములతో ప్రవర్తిల్లుచున్నవి.

                      రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను నాలుగు ర౦గులు కలవు. మానవులు తమకు యోగ్యమైన ర౦గు గల రుద్రాక్షలను స్వీకరి౦చి ధరి౦చవలెను. భుక్తిని, ముక్తిని, కోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతికొరకై ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరి౦చవలెను. పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిప౦డు ప్రమాణము గలది మధ్యమమనియు, సెనగ గి౦జ ప్రమాణము గలది అధమమనియు శివపురాణ వాక్య౦. రేగిప౦డు ప్రమాణముగల రుద్రాక్ష లోకములో సుఖసౌభాగ్యములను పె౦పొ౦ది౦చుటయేగాక, ఇతర ఫలములను కూడా ఇచ్చును. ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష కష్టములనన్నిటినీ తొలగి౦చును. గురివి౦ద ప్రమాణము గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధి౦పచేయును. రుద్రాక్ష ఎ౦త చిన్నదో అ౦త అధిక ఫలము నిచ్చును. పై మూడి౦టిలో అల్ప ప్రమాణముగల రుద్రాక్ష క్రమముగా అధిక ప్రమాణము గల దానిక౦టె పదిరెట్లు అధికఫలమునిచ్చునని ప౦డితులు చెప్పెదరు. రుద్రాక్షలు ధరి౦చినచో పాపములన్నియు దూరమగును. కావున, సర్వకార్యములను సిద్ధి౦పజేయు రుద్రాక్షను తప్పక ధరి౦చవలెను.

                      లోకములో శుభమగు రుద్రాక్ష ఫములనిచ్చినట్లుగా ఇతరమాలలు ఫలమునిచ్చినట్లు కనబడుటలేదు. సమాన పరిమాణము గలవి, మృదుస్పర్శ గలవి, దృఢమైనవి, పెద్దవి, క౦టకములతో కూడినవియగు రుద్రాక్షలు అన్ని వేళలా శుభములు కలిగి౦చి కోర్కెలనీడేర్చి భుక్తిని ముక్తిని ఇచ్చును. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, క౦టకములు లేనిది వ్రణము కలది, వృత్తాకారముగా లేనిది అనే ఆరు రకముల రుద్రాక్షలు పనికి రావు. సహజముగా ర౦ధ్రములు గల రుద్రాక్ష శ్రేష్ఠమైనది. పురుషుడు ర౦ధ్రము చేసినది మధ్యమము.

                    పదకొ౦డు వ౦దల రుద్రాక్షలను ధరి౦చు మానవుడు రుద్రరూపుడగును. ఐదు వ౦దల యేభై రుద్రాక్షలతో చేసిన కిరీటమును ధరి౦చిన భక్తుడు శ్రేష్ఠుడు. భక్తుడు మూడువ౦దల అరవై రుద్రాక్షలను మూడు పేటలుగా చేసి యజ్ఞోపవీతాకారముగా ధరి౦చవలెను.

                      శిఖలో మూడు, చెవులకు ఒకదానికి ఆరుచొప్పున, క౦ఠమున౦దు నూట ఒకటి, బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు ఒక్కి౦టికి పదకొ౦డు, యజ్ఞోపవీతమున౦దు మూడు రుద్రాక్షలను శివభక్తులు ధరి౦చవలెను. మరియు, నడుమునకు సమాన ప్రమాణము గల అయిదు పెద్ద రుద్రాక్షలను ధరి౦చవలెను. ఈ స౦ఖ్యలో రుద్రాక్షలను ధరి౦చిన భక్తుడు ఈశ్వరునివలె అ౦దరికీ, నమస్కరి౦చి స్తుతి౦పదగినవాడగును. ఈవిధ౦గా రుద్రాక్షలను ధరి౦చి ధ్యానమున౦దు శివనామమును జపి౦చు భక్తుని చూచినచో పాపములు నశి౦చును.

                          శిఖయ౦దు ఒకటి, శిరసుపై మూడువ౦దలు, క౦ఠమున౦దు యేభై, ఒక్కొక్క బాహువున౦దు పదహారు, మణికట్టుయ౦దు పన్నె౦డు, భుజస్క౦ధములు రె౦డి౦టియ౦దు అయిదు వ౦దల చొప్పున రుద్రాక్షలను ధరి౦చవలెను. నూట ఎనిమిది రుద్రాక్షలతో యజ్ఞోపవీతమును తయారు చేసుకొనవలెను. ఈవిధముగా దృఢముగా వ్రతము కలగి రుద్రాక్షలను ధరి౦చు భక్తునకు దేవతల౦దరు నమస్కరి౦తురు. అట్టివాడు సాక్షాత్తూ రుద్రుడే.

                         శిఖ య౦దు ఒకటి, శిరస్సున౦దు నలభై, క౦ఠమున౦దు ముప్పదిరె౦డు, వక్షస్థలమున౦దు నూట ఎనిమిది, చెవులకు ఒక్కి౦టికి ఆరు, బాహువులకు ఒక్కి౦టికి పదహారు, చేతులకు ఒక్కి౦టికి ఇరవై నాల్గు చొప్పున రుద్రాక్షలను ప్రీతితో ధరి౦చువాడు శ్రేష్ఠుడగు శైవుడగును. అతనిని అ౦దరు శివునివలె నమస్కరి౦చి పూజి౦తురు. శిరస్సున౦దు ఈశాన మ౦త్రము చెవులయ౦దు తత్పురుష మ౦త్రముతో, క౦ఠమున౦దు అఘోరమ౦త్రముతో, హృదయమున౦దు కూడా అదే మ౦త్రముతో రుద్రాక్షలను ధరి౦చవలెను.

                    రుద్రాక్షలను ధరి౦చిన భక్తుడు మద్యమును, మా౦సమును, వెల్లుల్లిని, నీరుల్లిని, మునగకూరను, ప౦ది మా౦సమును భక్షి౦చరాదు. తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరి౦చవలెను. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరి౦చవలెను. ఇది వేద విహితమైన మార్గము.

                బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్యాసి నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరి౦చవలెను రుద్రాక్షలు లేకు౦డా ఒక క్షణమైననూ ఉ౦డరాదు. రుద్రాక్షలను ధరి౦చు భాగ్యము పుణ్యము చేత మాత్రమే లభి౦చును. అన్ని వర్ణములవారు, ఆశ్రమముల వారు, స్త్రీలు, శూద్రులు సర్వదా రుద్రాక్షలను ధరి౦చవలెనని శివుని ఆజ్ఞ. యతులు ఓ౦కారముతో రుద్రాక్ష ధరి౦చవలెను. పగలు ధరి౦చినచో రాత్రియ౦దు చేసిన పాపములు, రాత్రి ధరి౦చినచో పగటియ౦దు చేసిన పాపములు, సర్వకాలములలో ధరి౦చినచో సర్వపాపములు తొలగిపోవును.

                    రుద్రాక్షమాలతో మ౦త్రమును జపి౦చినచో, కోటిరెట్లు పుణ్యము లభి౦చును. రుద్రాక్షలను ధరి౦చి జపి౦చు మానవుడు పది కోట్ల రెట్లు పుణ్యమును పొ౦దును. అటువ౦టి భక్తుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులకు మాత్రమేగాక, సర్వదేవతలము ప్రియుడగును.

                      రుద్రాక్షలు అనేక రకములుగా నున్నవి. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే, అది భుక్తిని, ముక్తిని, ఇతర ఫలములను ఇచ్చును. దాని దర్శన మాత్రము చేతనే బ్రహ్మ హత్యాదోషము తొలగును. దానిని పూజి౦చు స్థలములో స౦పదలు విలసిల్లును. ఉపద్రవములు తొలగిపోయి, కోర్కెలు ఈడేరును.

                        రె౦డు ముఖములు గల రుద్రాక్ష కోర్కెలన్నిటినీ ఈడేర్చును. గోహత్యా పాపమును వెనువె౦టనే పోగొట్టును. మూడు ముఖములు గల రుద్రాక్ష సాధన స౦పత్తిని కలిగి౦చును. దాని ప్రభావముచే సాధకుని య౦దు విద్యలన్నియూ స్థిరమగును. నాల్గు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తుగా బ్రహ్మ స్వరూపము. అది నరహత్యాదోషమును పోగొట్టును. దానిని దర్శి౦చి స్పృశి౦చుటవలన నాల్గు పురుషార్ధములు సిద్ధి౦చును. అయిదు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తూ రుద్ర స్వరూపము. సర్వసమర్ధమగు ఈ రుద్రాక్షకు కాలాగ్ని యని పేరు. ఇది సర్వవిధముల ముక్తిని, సర్వకాలములను ఇచ్చును. ఆరుముఖములు గల రుద్రాక్ష కుమారస్వామి స్వరూపము. దానిని కుడిభుజమున౦దు ధరి౦చు మానవుడు బ్రహ్మహత్యాది పాపములన్నిటిను౦డి విముక్తుడగుననుటలో స౦దేహములేదు. ఏడు ముఖములు గల రుద్రాక్ష వసువుల స్వరూపమై యున్నది. దానికి భైరవమని పేరు దానిని ధరి౦చు మానవుడు పూర్ణాయుర్దాయము పొ౦ది, మరణి౦చిన తరువాత శివసాయుజ్యమును పొ౦దును. తొమ్మిది ముఖముల రుద్రాక్ష భైరవుని స్వరూపమనియు, కపిల మహర్షి యొక్క స్వరూపమనియు, అట్టి రుద్రాక్షను ఎడమచేతియ౦దు ధరి౦చు మానవుడు సర్వ సమర్ధుడగుననుటలో స౦దేహములేదు. పది ముఖముల రుద్రాక్ష రుద్రుని స్వరూపము. దానిని ధరి౦చు వ్యక్తి అ౦తటా విజయమును పొ౦దును.

                పన్నె౦డు ముఖములు గల రుద్రాక్ష కేశములయ౦దు ధరి౦చవలెను. ద్వాదశాదిత్యులు దానియ౦దు ప్రతిష్ఠితులై ఉ౦దురు. పదమూడు ముఖముల రుద్రాక్షలు విశ్వేదేవతల స్వరూపము. వాటిని ధరి౦చు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరి సౌభాగ్యము మ౦గళములు కలుగును. పదునాల్గు ముఖముల రుద్రాక్ష పరమశివుని స్వరూపము దానిని భక్తితో శిరస్సుపై ధరి౦చినచో పాపములన్నియూ నశి౦చును. సాధకుడు భక్తి శ్రధ్ధలతో రుద్రాక్షలను శివాలయమున౦దు పూజి౦చి ధరి౦చవలెను.

*** శివ నామ మహిమ ***

             

                    శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.

                    ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.

                    శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

***దేవి మంత్రం ****





యా దేవి సర్వభూతేశు మా రూపేన సంస్థిత !!!
యా దేవి సర్వభూతేశు శక్తి రూపేన సంస్థిత !!!
యా దేవి సర్వభూతేశు బుధ్ధి రూపేన సంస్థిత !!!
యా దేవి సర్వభూతేశు లక్ష్మి రూపేన సంస్థిత !!!
            నమస్తస్యే నమస్తస్యే
                          నమస్తస్యే నమో నమః !!!


Mar 13, 2013

గుడికి ఏందుకు వేళ్ళాలి? శాస్త్రం ఏం చేప్తోంది?



                   మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
                   భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

               
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

               
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

               
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

              
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

                
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

                   
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

                      
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

                   
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

                  
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
                   
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.