Jul 11, 2013

మహప్రాణదీపం -- (manjunatha lyrics)


మంజునాధ  -- మహప్రాణదీపం
 
 
ఓం మహప్రాణదీపం శివమ్ శివమ్
మహోంకార రూపం శివమ్ శివమ్
మహసూర్య చంద్రాదినేత్రం పవిత్రం
మహగాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రం
మహకాంతి భీజమ్ మహదివ్య తేజమ్
భవానీసమేతం భజే మంజునాథం
ఓ..ఓం..ఓ..ఓంనమశంకరయాచ మయస్కరాయచ నమశ్షివయాచ -
శివతరాయచ భవహరాయచ

మహప్రాణ దీపం శివమ్ శివమ్

భజె మంజునాథమ్ శివమ్ శివమ్
అద్వైత భాస్కరమ్ అర్ధనారిశ్వరమ్

హ్రుదుశ హ్రుధయంగమమ్ చతురిధవిహంగమమ్
పంచ భూతాత్మకమ్ శత్చత్రునాశకమ్

సప్తస్వరేశ్వరమ్ అష్టసిద్ధీశ్వరమ్ నవరస మనోహరమ్
దశ దిశాసువిమలమ్

ఎకాదశోజ్వలమ్ ఎకనాథేశ్వరమ్

ప్రస్థుశివశంకరమ్ ప్రనథ జనకింకరమ్
దుర్జన భయంకరమ్ సజ్జన శుభంకరమ్
హారిభవ తారకమ్ ప్రకృతి విభ తారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశమ్ సురేశమ్ రుశేశమ్ పరేశమ్

నటేశమ్ గౌరీశమ్ గణేశమ్ భూథేశమ్
మహ మధుర పంచాక్షరిమంత్ర మాధ్యమ్
మహ హర్శ వర్శ ప్రవర్శమ్ సుధీశమ్
ఓం నమో హరయాచ స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ
మహ ప్రాణదీపమ్ శివమ్ శివమ్ ………
భజే మంజునాథమ్ శివమ్ ఓంశివమ్

డమ్ డమ్ డ డమ్డమ్.. డమ్ డమ్ డ డమ్డమ్

డంకా నినాధ నవ తండవాడంబరమ్
తద్దిమ్మి తకధిమ్మి ధిధిమ్మి ధిమిధిమ్మి
సంగీత సాహిత్య సుమ సమరమంబరమ్
ఓంకార హ్రీంకార శ్రీంకార హ్రైంకార మంత్ర బీజాక్షరమ్ మంజునాథేశ్వరమ్
ఋగ్వేద మాధ్యమ్ యజుర్వేద వేద్యమ్ కామ ప్రగీథమ్ అధర్మ ప్రగాథమ్
పురానేతిహసమ్ ప్రసిద్ధమ్ విశుద్ధమ్ ప్రపంఛైక ధూతమ్ విభుద్ధమ్ సుహిద్ధమ్
న కారమ్ మ కారమ్ శి కారమ్ వ కారమ్ య కారమ్ నిరాకార సాకార సారం
మహ కాల కాలమ్ మహ నీలకంఠమ్ మహనంద నందమ్ మహట్టాట్టహాసమ్
జటాజూట రంగైక గంగా సుచిత్రమ్
జ్వల:రుధ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్
మహకాశ భాశమ్ మహ భాను లింగం….. మహ హన్తు వర్నమ్ సువర్నమ్ ప్రవర్నమ్
సౌరాష్ట్ర సుందరమ్ సొమనాథేశ్వరమ్ శ్రీశైల మందిరమ్ శ్రీమల్లికార్జునమ్
ఉజ్జయినిపుర మహ కాళేశ్వరమ్ వైధ్యనాథేశ్వరమ్ మహ భీమేశ్వరమ్ అమర లింగేశ్వరమ్
భావ లింగేశ్వరమ్ కాశి విశ్వేశ్వరమ్ పరమ్ గ్రిశ్నెశ్వరమ్
త్ర్యంబకాధీశ్వరమ్ నాగలింగేశ్వరమ్ శ్రీ…… కేధరలింగేశ్వరమ్
అగ్నిలింగాత్మకమ్ జ్యోతిర్లింగాత్మకమ్ వాయులింగాత్మకమ్
ఆత్మలింగాత్మకమ్ అఖిలలింగాత్మకమ్ అగ్నిహోమాత్మకమ్..
అనాధిమ్ అమేయమ్ అజేయమ్ అచిన్త్యమ్ అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్
అనాధిమ్ అమేయమ్ అజేయమ్ అచిన్త్యమ్ అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్..
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిమ్…..
ఓం…… నమ సోమయాచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలయచ కాంతయచ
రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయ..చ..

 

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా (devullu song lyrics)

దేవుళ్ళు  -- మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత     "మహా"
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్ఠాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి     "మహా"
ఓంకార రావాల  అరుణ కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను క్రుతయుగములోన
కొండపైన అర్జునుడు.. తపమును గావించెను,
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జుని పేరిట,
విజయవాడ అయినది నగరము
జగములన్నియు జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్దపసుపు  కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల   అరుణమణియే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన   కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ   ఇదియే ముక్తి దీపం      "మహా"
దేవి నవరాత్రులలో 
వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన  
 కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే  బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే  సుమంతమూర్తి గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని  జనులకందించే
దివ్యరూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గానమొసగు  వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు  ప్రసాదించు మహాదుర్గ
శత్రు నివాసిని సత్యస్వరూపిణి  మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి  శ్రీ రాజరాజేశ్వరీ
భక్తులందరికీ కన్నుల పండగ అమ్మా
నీ దర్శనం దుర్గామ్మా నీ దర్శనం  "మహా"